Verse
యెహోవా కార్యములన్నిటికై - అర్పింతు కృతజ్ఞతలు
ఆశించెడి వారి ప్రాణములెల్లను - సంతృప్తి పరచెదవు
Verse
వెదకిన నా మది కొసగెను రక్షణ
దర్శనమిచ్చి దరి జేర్చితివి
నీ రాజ్యమును నీ నీతియును
వెదకుమని నన్ను ప్రేమతో పిలిచితివి
Verse
కనిపించెడి ఆ కానానును జూడ
ధన్యతలకది ధననిధిగ్ నుండె
దానిపై నుండు నీకను దృష్టి
దివా రాత్రులు ప్రియమది నీకెంతో
Verse
నూతన మాయెను భూమ్యాకాశముల్
పాపముల్ పడిన సముద్రములేదట
పరిశుద్ధంబైన యెరూషలేమది
దేవుని మహిమతో దిగివచ్చుచుండె
Verse
కళంకము లేక అలంకరించిన
పెండ్లి కుమార్తెయై ప్రియునిజూచు
సంఘము యిదియే ప్రియుడా కనుమా
కానవు నెచ్చటన్ ఈ వజ్రకాంతుల్
Verse
శిల్పియై యెహోవా నిర్మించుచున్న
పండ్రెండు పునాదుల ఆ పట్టణముకై
నబ్రహాము ఎదురు చూచెనుగా
పరికించుము నీవు నీ కన్నుల నెత్తి
Verse
కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును
నరహంతకులును విగ్రహారాధికులు
అబద్దమును ప్రేమించి జరిగించు
ప్రతివాడునట వెలుపట నుందురుగా
Verse
కృప కాలంబిది ఓ నా ప్రియుడా
నిర్మల వాక్యమన్ పాలను పొంది
శిశువును బోలి ఎరుగుము నీవు
పదములు నేర్తువు అపవాది నెదిరింపన్