Verse
యెహొవా కొరకు ఎదురుచూడు మనసా
సిగ్గునొందనియ్యడు నా తండ్రి నిన్ను
కష్టమైనా కన్నీరైనా ఒపికతో నీ పరుగును కొనసాగించు
Verse
బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి
అరణ్యంలో తోడుండి సముద్రంలో మార్గమేసి
చేయిపట్టి వారిని అద్దరికి చేర్చిన
Verse
అన్నలచే అమ్మబడి అనాధగా అలమటించి
చెరసాల పాలై చింతలలో మిగిలినా
యోసేపుకు తోడుండి బహుగా హెచ్చించినా