Verse
యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్
నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్
నాశనమగు గుంటలో నుండియు
జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను
Verse
నా పాదములను బండపై నిలిపి
నా యడుగులు దానిపై స్థిరపచి
క్రొత్త గీతమును నా నోట నుంచెను
కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు
Verse
గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక
ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు
దయామయా మా యెడల నీకున్న
తలంపులు బహు విస్తారములు
Verse
వాటిని వివరింప లేనిల నీకు
సాటియైన వాడెవడైనను లేడు
నైవేద్య బలులను కోరలేదు
నాకు చెవులను నీవు నిర్మించినావు
Verse
పాపపరిహార బలులను దహన
బలులను నీవు తెమ్మన లేదు
నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి
యున్నట్లుగా నేను వచ్చియున్నాను
Verse
నీ చిత్తముచేయ నాకు సంతోషము
నా ఆంతర్యములో నీ శాసనములున్నవి
ప్రజా సంఘములో నీ నీతి సువార్త
ప్రకటించియున్నానని నేనంటిని
Verse
నీ నీతిని నా మదిలో దాల్చి
నీతి నిలయ నే నూరకుండ లేదు
సంఘములో నీ రక్షణ కృపను
సత్యమును నే దాచలేదు