Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Maa Prabhuvaa Bhoomi Aakaashamulo

యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో

Yehova Maa Prabhuvaa Bhoomi Aakaashamulo

Verse
యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
మహిమగల నీ నామము గొప్పది
Verse
పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ
బాలుర స్తుతి స్తోత్రములతో
స్థాపించితివి నీవొక దుర్గము
నేదాగునట్లు ఆశ్రయ దుర్గము
Verse
నీ చేతి పనియైన ఆకాశమును
చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ
మానవుండు ఏపాటివాడు
Verse
నీకంటె మానవుని కొంచెముగా
తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును
వానికి ధరింపజేసితివి
Verse
అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రిందనుంచి
అధికారము వానికిచ్చితివి
Verse
నీ నామము మా ప్రభువా యెహోవా
ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మా కిచ్చితివి
నీ రూపమును మాకు హల్లెలూయ

Related Tags

PraiseWorshipPsalm