Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Maa Thandri Gaada Yesundu

యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు

Yehova Maa Thandri Gaada Yesundu

Lyricist: Purushothamu Choudari
Chorus
యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ
గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ‖ యెహోవా ‖
Verse
మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై
యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు‖ యెహోవా ‖
Verse
అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా
చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ‖ యెహోవా ‖
Verse
పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో
మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి‖ యెహోవా ‖
Verse
తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి
మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి‖ యెహోవా ‖
Verse
పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా
నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు‖ యెహోవా ‖
Verse
కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్
మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు‖ యెహోవా ‖

Related Tags

WorshipJesus ChristGod The Father