Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

యెహోవ మన కొరకు గొప్ప కార్యములను

Yehova Mana Koraku Goppa Kaaryamulanu

Verse
పల్లవి: యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను
జేసెనని మనము ఆనందించెదము
Verse
ఆయన యేర్పరచిన దినమిది - అగుపడె మనకు ఆశ్చర్యముగా
దీనియందు మనముత్సహించి - సంతోషించెద మెపుడు
Verse
తన సేవకులు మొరపెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును
మన మెల్లరమును యేకముగా - కూడి - మహిమను చాటెదము
Verse
యాకోబులో ప్రభు యే దోషమును - ఇశ్రాయేలులో యే వంకరతనమున్
కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము
Verse
క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది
దానిమీద కట్టబడితిమి మనము తన రక్షణ ప్రకటింతము
Verse
ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై
అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము
Verse
మన ప్రభువైన క్రీస్తేసునందు - పరిశుద్ధ ఆలయముగ మనము
నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము
Verse
ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు
స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయ

Related Tags

PraiseThanksgiving