Verse 1
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. కీర్తన Psalm 122
Verse
యెహోవా మందిరమునకు వెళ్లుదమని
జనులు అనినప్పుడు సంతోషించితిని
Chorus
యెహోవా మందిరమునకు నడిచెదము
Verse
యెరూషలేము నగరు నీ గుమ్మములలో
మా పాదములు బాగుగా నిలుచుచున్నవి
Verse
యెరూషలేమా బాగుగా కట్టబడిన
పట్టణమువలె కట్టబడియున్నావు
Verse
అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా
దేవుని జనము స్తుతించ వెళ్ళును
Verse
జనముల యొక్క గోత్రములు
యెహోవా నామమును స్తుతింప వెళ్ళును
Verse
అక్కడ దావీదు వంశీయుల యొక్క
నీతి సింహాసనము స్థాపించబడెను
Verse
యెరూషలేము క్షేమము కొరకు
యెడతెగక ప్రార్థన చేయుడి
Verse
యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
యెన్నడును వర్ధిల్లెదరు గాక
Verse
నీ ప్రాకారములలో నెమ్మది
నీ నగరులలో క్షేమముండును గాక
Verse
నా సహోదర సహవాసుల నిమిత్తము
క్షేమము కలుగునని నేనందును
Verse
దేవుడైన యెహోవా మందిరమును బట్టి
నీకు మేలుచేయ ప్రయత్నించెదను