Chorus
యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం‖ యెహోవా ‖
Verse
నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను
ఎడబాయని దేవా‖ యెహోవా ‖
Verse
మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై
రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను
అదిరెను ధరణి భయకంపముచే‖ యెహోవా ‖
Verse
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ
జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల
జేర్చిన బలమైన దేవుడు‖ యెహోవా ‖
Verse
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు
వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను
వైరుల నెల్లను‖ యెహోవా ‖
Verse
మేఘములపై ఆయన వచ్చును మేఘములను
తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయమిచ్చును అపవాదికిని‖ యెహోవా ‖
Verse
దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల
వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి‖ యెహోవా ‖
Verse
నా కళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో
శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ
తన పక్షము జేర్చిన‖ యెహోవా ‖
Verse
యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు
అర్హుడ నీవు అన్యజనులలో ధన్యతజూపుచు హల్లెలూయా
స్తుతిగానము జేసెద‖ యెహోవా ‖