Verse
యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము‖ 2x ‖
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం‖ 2x యెహోవ ‖
తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా‖ 4x యెహోవ ‖
నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా‖ 4x యెహోవ ‖