Verse
దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము
కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము
Chorus
యెహోవా నా దేవా
Verse
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
Verse
నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను
నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను
Verse
ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను
తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
Verse
పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే
నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
Verse
నీ వంతరంగమున - సత్యము కోరుచున్నావు
ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
Verse
హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును
హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
Verse
ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును