Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Naa Kaapari

యెహోవా నా కాపరి

Yehova Naa Kaapari

Lyricist: Songs Of Zion
Verse
యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్‖ యెహోవా ‖
Verse
మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్‖ యెహోవా ‖
Verse
పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను‖ యెహోవా ‖
Verse
నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది‖ యెహోవా ‖
Verse
చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను‖ యెహోవా ‖

Related Tags

PraiseWorshipShepherd