Verse
యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ
బ్రోచి నన్ను మనుపు నాతఁడే‖ నాతఁడే ‖
Verse
పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు
సదా యిచ్చు నాతఁడే‖ నాతఁడే ‖
Verse
శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు
విభుఁడు అతఁడే‖ అతఁడే ‖
Verse
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక
నా తోడు ఆయనే‖ ఆయనే ‖
Verse
దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో
నీతి దారిలో నడుపు‖ నడుపు ‖
Verse
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి
తృప్తిపరుచు విభుఁడు ఆయనే‖ ఆయనే ‖
Verse
ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ
బూయుచుండు సకల వేళలన్‖ సకల వేళలన్ ‖
Verse
బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా
క్షేమములు నా వెంటవచ్చును‖ నా వెంటవచ్చును ‖