Verse 1
Reference: యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కీర్తన Psalm 23
Chorus
యెహోవా నా కాపరి - లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు
Verse
శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు
Verse
సర్వదా నాదు ప్రాణంబునకు - సేద దీర్చుచున్నాడు యెహోవా
Verse
తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు
Verse
చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను
Verse
నీ దుడ్డుకర్ర నీ దండముతో న-న్నాదరించి తోడై యుందువు
Verse
నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు
Verse
నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది
Verse
నన్ను వెంటాడు సదా కృప క్షేమము - నిత్యమెహోవా మందిరములో నుండెద