Verse
యెహోవా నా కాపరి – యేసయ్య నా ఊపిరి
నాకు లేమి లేదు‖ 2x ‖
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి‖ యెహోవా ‖
Verse
పచ్చికగల చోట్ల
నన్ను పరుండజేయును‖ 2x ‖
శాంతికరమగు జలముల కడకు
నన్ను నడిపించును‖ 2x లోయలలో ‖
Verse
గాఢాంధకారపు లోయలలో
సంచరించినను‖ 2x ‖
అపాయమేమియు కలుగదు నాకు
నీవు తోడుండగా‖ 2x లోయలలో ‖
Verse
తన నామమున్ బట్టి
నన్ను నీతి మార్గములో‖ 2x ‖
త్రోవ చూపి నడిపించును
సేదదీర్చును‖ 2x లోయలలో ‖
Verse
చిరకాలము నేను
యెహోవా సన్నిధిలో‖ 2x ‖
నివాసమొందెదను నేను
నిత్యము స్తుతియింతును‖ 2x లోయలలో ‖