Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Naa Kaapari Yinka Koduvemi

యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి

Yehova Naa Kaapari Yinka Koduvemi

Lyricist: Mallela Solomon George
Chorus
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి‖ యెహోవా ‖
Verse
పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ
జక్క గా నడిపించు‖ యెహోవా ‖
Verse
ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు
ననుఁ బట్టి నడిపించు‖ యెహోవా ‖
Verse
గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు
నన్నెపుడు‖ యెహోవా ‖
Verse
నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు
కఱ్ఱయును దండంబు‖ యెహోవా ‖
Verse
నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద
లంటె నూనెను బోసి‖ యెహోవా ‖
Verse
నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా
దయలు వెంటాడు‖ యెహోవా ‖
Verse
పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే
నిరతంబు నివసింతు‖ యెహోవా ‖

Related Tags

WorshipShepherdPsalm 23