Verse
పల్లవి:
యెహోవా నా మొర లాలించను - దన మహా దయనుననుగణీంచెను
అహర్నిశల దీన్యహీనూడగు నా - దుహయనెడు ధ్వని గ్రహించమని
...యెహోవా...
Verse
పెను పిశాచి కడిమి బడగొట్టెను - దన వశాన నను నిలువబెట్టెను - ప్రశాంత
మధురసు - విశేష వాక్పల - నిశాంతమున జేర్చి సేద దీర్చెను
...యెహోవా...
Verse
మదావళము బోలునామదిన్ - దన ప్రదీప్త వాక్యంకుశాహతిన్ - యదేచ్చలన్నీటి
గుదించి పాపపు - మెదల్ తుదల్ నరికి దరికి చేర్చెను
...యెహోవా...
Verse
అనీతి వస్త్రమెడలించెను - యేసునాధు రక్తమున ముంచెను - వినూత్న
యత్నమె - దనూని యెన్నడు - గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను
...యెహోవా...
Verse
విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకి లాగినను సుఖకళావళుల్ మనసులోన నిలిపెను
...యెహోవా...
Verse
అగన్య పాపియని త్రోయక - నన్ను గూర్చి తన సుతుని దాచక
తెగించి మృతికో - ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానణంచెను