Chorus
యెహోవా నా దేవా నిత్యము - నేను నిన్ను స్తుతియించెద
హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ
Verse
యెహోవా నా శత్రువులను - నా పై సంతోషింప నీయక
నీవు నన్నుద్ధరించినందుకై నేను - నిన్ను కొనియాడుచున్నాను
Verse
నేను నీకు మొరపెట్టగా
నీవు నన్ స్వస్థపరచితివి
పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి
భక్తులారా ప్రభున్ కీర్తించుడు
Verse
యెహోవా పాతాళములో నుండి
నా ప్రాణము లేవదీసితివి
నేను సమాధిలోకి దిగకుండగ
నీవు నన్ను బ్రతికించితివి
Verse
ఆయన కోపము నిమిషమే
దయ ఆయుష్కాలముండును
ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ
మున సంతోషము కలుగును
Verse
నే నెన్నడు కదలనని నా
క్షేమ కాలమున తలచితి
యెహోవా దయ కలిగి నీవే నా
పర్వతము స్థిరపరచితివి
Verse
నీ ముఖము నీవు దాచిన
యపుడు నేను క్షోభిల్లితి
యెహోవా నీకే మొర పెట్టితిని
నా ప్రభువును బ్రతిమాలు కొంటిని
Verse
నేను సమాధిలోకి దిగిన
నా ప్రాణము వలన లాభమా
మన్ను నిన్ను స్తుతించునా?
నీ సత్యమును గూర్చి అది వివరించునా?
Verse
నా అంగలార్పును నీవేగా
నాట్యముగా మార్చియుంటివి
నా గోనెపట్ట విడిపించి సంతోష
వస్త్రము ధరింప జేసితివి