Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Nanu Karuninchuma

యెహోవా నను కరుణించుమా

Yehova Nanu Karuninchuma

Lyricist: P Satish Kumar
Verse
యెహోవా నను కరుణించుమా
నా దేవా నను దర్శించుమా‖ 2x ‖
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను‖ యెహోవా ‖
Verse
విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనస్సు మూగదై‖ 2x ‖
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది‖ 2x దినమంతయు ‖
Verse
అవమానము చేత నా గుండెలో గాయమై
(నడి) వంచన చేత నా ఊపిరి భారమై‖ 2x ‖
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది‖ 2x దినమంతయు ‖

Related Tags

WorshipPrayerRepentance