Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Nee Kopamunu Chetha Gaddimpakumu Aa

యెహోవా నీ కోపమును చేత గద్దింపకుము ఆ

Yehova Nee Kopamunu Chetha Gaddimpakumu Aa

Verse
యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ‖ ఆ ‖
నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము
Verse
నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ‖ ఆ ‖
నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది
Verse
నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ‖ ఆ ‖
పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు
Verse
నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ‖ ఆ ‖
నాపై మోయలేని బరువు - వలె నున్నవి
Verse
మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ‖ ఆ ‖
కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు
Verse
నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ‖ ఆ ‖
నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను
Verse
నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ‖ ఆ ‖
నా పాపమును గూర్చి విచారపడుచున్నాను
Verse
నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ‖ ఆ ‖
నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు
Verse
మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ‖ ఆ ‖
మేలు చేసినందుకు వారు - విరోధులైరి
Verse
దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ‖ ఆ ‖
రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము

Related Tags

PrayerRepentancePsalm