Verse
యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్
Verse
తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదను
కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
పాపము క్షమియించె‖ 2x ‖
Verse
ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు
నన్ను విడిపించుటకు నీవు - నమ్మతగిన వాడవు
Verse
నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్
నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్
Verse
నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా
నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు
Verse
మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు
హల్లెలూయ పాడెదను