Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Nee Mahima Sthavamu Yesuni Sa

యెహోవా నీ మహిమ స్తవము యేసుని స

Yehova Nee Mahima Sthavamu Yesuni Sa

Lyricist: Purushothamu Choudari
Chorus
యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది
యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ
మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు
బలముఁ గ న్పపడ దీవించుము‖ యెహోవా ‖
Verse
ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు
దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ
కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ
నికేతనంబులు‖ యెహోవా ‖
Verse
పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని
సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ
మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల
నిమ్మని నెరి బ్రార్థింతుము‖ యెహోవా ‖
Verse
అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ
మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు
నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట
కిందురాను నీ వింక నొనర్పుము‖ యెహోవా ‖
Verse
పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున
నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును
సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త
మహౌ షధ మిడి ప్రోవను‖ యెహోవా ‖
Verse
ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని
కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా
కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది
సౌఖ్యమొందుదము‖ యెహోవా ‖

Related Tags

WorshipChurch Dedication