Chorus
యెహొవా నీ నామము ఎంతో బలమైనది‖ 2x ‖
Verse
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి
యెహొషువ ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి
Verse
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి
Verse
సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే రక్షించే నీ హస్తము
Verse
చెఱసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధింపగా సంకెళ్ళు విడిపోయెను
Verse
పౌలు సీలను బంధించి చెఱసాలలో వేయగా
పాటలతో ప్రార్ధించగా చెఱసాల బ్రద్ధలాయె