Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Nee Yokka Maata Choppuna

యెహోవా నీ యొక్క మాట చొప్పున

Yehova Nee Yokka Maata Choppuna

Verse
యెహోవా నీ యొక్క మాట చొప్పున
నీ దాసునికి మేలు చేసియున్నావు
Verse
మంచి వివేచన మంచి జ్ఞానమునకు - కర్త నీవే నాకు బోధ చేయుము
నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని
Verse
నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితిని
నేడు నీ మాట నెరవేర్చు చున్నాను
Verse
దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావు
నీ కట్టడల నాకు బోధించుము
Verse
గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములు
నీ యుపదేశము లనుసరింతును
Verse
వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవి
ఆజ్ఞలలో ఆనందించుచున్నాను
Verse
దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొంది
యుండుట నాకు యెంతో మేలాయెను
Verse
వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటె
నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు

Related Tags

PsalmGuidanceWisdom