Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Neevu Nannu Parisheelinchi Telisikontivi

యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి

Yehova Neevu Nannu Parisheelinchi Telisikontivi

Verse
యెహోవా - నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి
నేను కూర్చుం - డుటయు లేచుట
నీకు తెలియును తలంపు నెరుగుదువు
Verse
పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను
నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
Verse
యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు
ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
Verse
నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము
నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి - పారిపోవుదును
Verse
నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు
పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు
Verse
సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని
వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్ను నడిపించున్

Related Tags

WorshipPsalm