Verse
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు
యేసువా నీకు సాటియైన వారెవ్వరు
Verse
సృష్టికి ఆధారుడా అద్వితీయుడా
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా
అందరిలో సుందరుడ - కాంక్షనీయుడా
వందనముల కరుహుడా పూజ్యనీయుడా‖ యెహోవా ‖
Verse
పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
లోక పాపమును మోసిన దైవ తనయుడా
మరణపు కోరలు పీకిన విజయ వీరుడా
శరణన్నచో కరుణ చూపు పరంధాముడా‖ యెహోవా ‖