Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Puri Punadi Yila Maha Sthi

యెహోవ పురి పునాది యిల మహా స్థి

Yehova Puri Punadi Yila Maha Sthi

Lyricist: Narella Namuyelu Subbayya
Verse
యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది
Verse
మహా సీయోను గుమ్మములు అవి యెహోవాకు నతిప్రియములు
ఇఁక నిహ జను లెల్లరు గొనియాడి నిను బహు కీర్తంతురు పట్టణమా‖ యెహోవా ‖
Verse
భూమిలో సర్వజనాంగముల్ తమ నామము లచ్చట వ్రాయన్ ఆ
స్వామి యెహోవా వారిన్ అట జన్మించిరి యని వ్రాయన్‖ యెహోవా ‖
Verse
పాటలు పాడి జనాంగమా తమ యూటలు నీ కడ గలవే యని
స్తుతియింతురు నిను స్తుతిపాత్రా యిఁక భజియింతురు నిను నిజభక్తిన్‖ యెహోవా ‖
Verse
ఇది క్రైస్తవ సంఘంబే కడు శుభముల నిచ్చు స్థలంబే ధర బుధు
లేసుని నిటఁ గనుచు నతి ముదమును బొందుట నిజమే‖ యెహోవా ‖
Verse
జనః కుమా రాత్మకును నిఁక ఘనమహిమలు గల్గునుగాక ఆ
దిని నుండిన రీతిని నిపుడు నిఁక ననవరతముండును ఆమేన్‖ యెహోవా ‖

Related Tags

WorshipChurchZion