Chorus
యెహోవ సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ
నర్పణ సమర్పించుఁడి‖ యెహోవ ‖
Verse
ప్రభు వడుగు నర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రధానములు
విభునకు నియ్యుఁడు విరివిగను‖ యెహోవ ‖
Verse
రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవత్సలునకు శక్తికొలఁది
మీ రర్పించుఁడి‖ యెహోవ ‖
Verse
శృంగారాలయ మీలలోఁ పొంగారఁ గట్టుటకు బంగారు వెండి యును
బాగుగ నియ్యుఁడి ప్రభుపేర‖ యెహోవ ‖
Verse
వరుమానములచేత వాంఛింప వలదండి గురు నాజ్ఞ చొప్పునను
విరివిగ హృదయము లర్పించుఁడి‖ యెహోవ ‖
Verse
యెహోవ జనులారా యియ్యుండి మనసార యెహోవ యిచ్చి నది
యేసున కర్పణ చెల్లింతము‖ యెహోవ ‖