Chorus
యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని
మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు‖ ధన్యులు ‖
Verse
దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల
కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ‖ నిజముగ ‖
Verse
ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల
చందము పెంపొందుదు రెంతయు సొంపుగను‖ సొంపుగను ‖
Verse
దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు
గావున నీ పిల్లల పిల్లలను
గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు‖ వెలగుదువు ‖