Verse
యెహోవా యీరే నను చూసేవాడ - నీవండుటయే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రధాత - నీ గాయమే బాగు చేయున్
యెహోవా షమ్మ తోడుండువాడా - నా అక్కరలన్ని తీర్చున్
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు‖ 2x ‖
Verse
యెహోవా ఎలోహీం నా సృష్టికర్త - నీ వాక్కుయే ఈ శృష్టి
యెహోవా ఎల్యోన్ మహోన్నతుడ - నీకు సాటి లేరెవరు
యెహోవా షాలోం శాంతి ప్రధాత - నా హృదిలోనికి రమ్ము
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు‖ 2x ‖
Verse
యెహోవా ఎల్ షద్దాయ్ బహు శక్తిమంతుడ - నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరునతో కాపాడు
యెహోవా నిస్సీ జయమిచ్చు దేవా - నా అభయము నీవే ప్రభు
నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు‖ 2x ‖