Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Bhajana Cheyandi Paapa Narulaara

యెహోవా భజన చేయండి పాప నరులారా

Yehovaa Bhajana Cheyandi Paapa Narulaara

Lyricist: Yesudasu Narsayya
Verse
యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి
పోకండి‖ యెహోవా ‖
Verse
యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు
భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము‖ యెహోవా ‖
Verse
యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి
మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి‖ యెహోవా ‖
Verse
జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి
భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి‖ యెహోవా ‖
Verse
మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన
జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన
మున మరవక తలఁచి‖ యెహోవా ‖
Verse
కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ
గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు
నిపుడు కర్తకు నిచ్చి‖ యెహోవా ‖

Related Tags

WorshipRepentanceSalvation