Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Maa Kaapari

యెహోవా మా కాపరి

Yehovaa Maa Kaapari

Verse
యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు‖ 2x యెహోవా ‖
Verse
వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను‖ 2x ‖
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను‖ యెహోవా ‖
Verse
కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను‖ 2x ‖
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను‖ యెహోవా ‖
Verse
పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను‖ 2x ‖
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము‖ యెహోవా ‖

Related Tags

PraiseWorshipShepherd