Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Mahaathmyamu Goppadhi Yemthoa

యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో

Yehovaa Mahaathmyamu Goppadhi Yemthoa

Verse
యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో
గ్రహింప శక్యము కానిది
Verse
పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను
పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి
పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్
పరశుద్ధ కార్యము ప్రకటింతుము
Verse
మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను
మహిమను విడచి నరుడుగ జన్మించె
ఆహా సిలువలో సాతానును జయించె
బాహాటముగా రక్షణ నొసగె మనకు
Verse
తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు
తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి
అర్పించెను ప్రాణము మంచి కాపరియై
గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను
Verse
ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము
అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి
నాథుడేసునందు పొందితిమి వెలుగు
అధికమైన జ్ఞాన మహిమలొసగె
Verse
పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము
పాప ఫలితము మరణము సహింతువా?
పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే
తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును
Verse
ప్రధానుల కంటెను అధికారులకన్న
అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును
అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు
అందరం పాడెదము హల్లెలూయ పాట

Related Tags

PraiseWorshipSalvation