Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Mahima Nee Meeda

యెహోవా మహిమ నీ మీద

Yehovaa Mahima Nee Meeda

Verse
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును‖ 2x ‖
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది‖ 2x ‖
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము‖ 2x ‖
Verse
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము‖ 2x ‖
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు‖ 2x లెమ్ము ‖
Verse
ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును‖ 2x ‖
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను‖ 2x లెమ్ము ‖

Related Tags

PraiseGloryLight