Verse
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం‖ 2x యెహోవా ‖
Verse
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ‖ 2x ‖
వరదవలె భక్తిహీనులు పొర్లిన‖ 2x ‖
విడువక నను ఎడబాయని దేవా‖ 2x యెహోవా ‖
Verse
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై‖ 2x ‖
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను‖ 2x ‖
ఆదరెను ధరణి భయకంపముచే‖ 2x యెహోవా ‖
Verse
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును‖ 2x ‖
జలరాసులనుండి బలమైన చేతితో‖ 2x ‖
వెలుపల చేర్చిన బలమైన దేవుడు‖ 2x యెహోవా ‖
Verse
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను‖ 2x ‖
తన నోటనుండి వచ్చిన అగ్ని‖ 2x ‖
దహించివేసెను వైరులనెల్లన్‖ 2x యెహోవా ‖
Verse
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును‖ 2x ‖
ఉరుముల మెరుపుల మెండుగ జేసి‖ 2x ‖
అపజయమిచ్చును అపవాదికిని‖ 2x యెహోవా ‖
Verse
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును‖ 2x ‖
గర్విష్టుల యొక్క గర్వమునణుచును
సర్వమునెరిగిన సర్వాధికారి‖ 2x యెహోవా ‖
Verse
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి‖ 2x ‖
రక్షణ కేడెము నాకందించి‖ 2x ‖
అక్షయముగ తన పక్షము జేర్చిన‖ 2x యెహోవా ‖
Verse
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే‖ 2x ‖
అన్యజనులలో ధన్యత చూపుచు‖ 2x ‖
హల్లెలూయ స్తుతిగానము చేసెద‖ 2x యెహోవా ‖