Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa naa devaa nee dhayalo kaayumaa

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా

Yehovaa naa devaa nee dhayalo kaayumaa

Lyricist: P James
Verse
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే
Verse
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా!
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
Verse
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు
నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!
Verse
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే!
నన్ను నియమించితివే – నాలో ఫలించితివే!
Verse
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే

Related Tags

WorshipGracePrayer