Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Naaku Velugaaye

యెహోవా నాకు వెలుగాయె

Yehovaa Naaku Velugaaye

Verse
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను‖ 2x ‖
Verse
నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే‖ 2x ‖
తన ఆజ్ఞలలో జీవించుటకై
కృపతో నింపి కాపాడుము‖ 2x యెహోవా ‖
Verse
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే‖ 2x ‖
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను‖ 2x యెహోవా ‖
Verse
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను‖ 2x ‖
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును‖ 2x యెహోవా ‖

Related Tags

PraiseWorshipProtection