Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Nee Naamamu

యెహోవా నీ నామము

Yehovaa Nee Naamamu

Verse
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది‖ యెహోవా ‖
Verse
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి‖ 2x ‖
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి‖ 2x యెహోవా ‖
Verse
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా‖ 2x ‖
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి‖ 2x యెహోవా ‖
Verse
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి‖ 2x ‖
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము‖ 2x యెహోవా ‖
Verse
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా‖ 2x ‖
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను‖ 2x యెహోవా ‖
Verse
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా‖ 2x ‖
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే‖ 2x యెహోవా ‖

Related Tags

WorshipPrayerPower