Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Yire Nanu Chusevaadaa Neevundutaye Chaalu

యెహోవా యీరే నను చూసేవాడా నీవుండుటయే చాలు

Yehovaa Yire Nanu Chusevaadaa Neevundutaye Chaalu

Verse
యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు
యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు
నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు‖ 2x ‖
Verse
యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి
యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము
నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు‖ 2x ‖
Verse
యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు
నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు‖ 4x ‖

Related Tags

WorshipTrustGod Names