Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaaku Sthuthulu Paadandi - Meeru

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు

Yehovaaku Sthuthulu Paadandi - Meeru

Verse
యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు
Verse
ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు‖ యెహోవాకు ‖
Verse
తంబురతోను సితారతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది – మీరు‖ యెహోవాకు ‖
Verse
భక్తులై ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఊప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు‖ యెహోవాకు ‖
Verse
అన్య జనులను శిక్షించుటకు
రాజుల గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు‖ యెహోవాకు ‖

Related Tags

PraiseWorshipThanksgiving