Verse
యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 2x యెహోవాను ‖
Verse
నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను‖ 2x ‖
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును‖ 2x యెహోవాను ‖
Verse
నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా‖ 2x ‖
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును‖ 2x యెహోవాను ‖
Verse
నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా‖ 2x ‖
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును‖ 2x యెహోవాను ‖