Verse
యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు‖ 2x ‖
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి‖ 2x ‖
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు‖ యెహోవాను ‖
Verse
ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో‖ ఆత్మతోను ‖
Verse
స్వరమండలముతో ఆయనను స్తుతియించు
సితార స్వరములతో ఆయనను స్తుతియించు
గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు‖ ఆత్మతోను ‖