Verse
యెహెూవాయే నా బలము
యెహెూవాయే నా శైలము‖ 2x ‖
యెహెూవాయే నా కోటయు
యెహెూవాయే నా కేడెము
యెహెూవాయే నా శృంగము
యెహెూవాయే నా దుర్గము‖ 2x యెహెూవాయే ‖
Verse
నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను‖ 2x ‖
నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను‖ 2x యెహెూవాయే ‖
Verse
నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను
నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను‖ 2x ‖
నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను
నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను‖ 2x యెహెూవాయే ‖