Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaaye Naa Kaaparigaa

యెహోవాయే నా కాపరిగా

Yehovaaye Naa Kaaparigaa

Verse
యెహోవాయే నా కాపరిగా
నాకేమి కొదువగును‖ 2x ‖
Verse
పచ్చికగల చోట్లలో
నన్నాయనే పరుండజేయును‖ 2x ‖
శాంతికరమైన జలములలో‖ 2x ‖
నన్నాయనే నడిపించును‖ 2x యెహోవాయే ‖
Verse
గాఢాంధకార లోయలలో
నడిచినా నేను భయపడను‖ 2x ‖
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును‖ 2x ‖
నా తోడైయుండి నడిపించును‖ 2x యెహోవాయే ‖
Verse
నా శత్రువుల ఎదుట నీవు
నా భోజనము సిద్ధపరచి‖ 2x ‖
నా తల నూనెతో నంటియుంటివి‖ 2x ‖
నా గిన్నె నిండి పొర్లుచున్నది‖ 2x యెహోవాయే ‖
Verse
నా బ్రతుకు దినములన్నియును
కృపాక్షేమాలు వెంట వచ్చును‖ 2x ‖
నీ మందిరములో నే చిరకాలము‖ 2x ‖
నివాసము చేయ నాశింతును‖ 2x యెహోవాయే ‖

Related Tags

PraiseWorshipShepherd