Verse
యెహోవా మా దేవ – సర్వలోక దైవమా
యుగ యుగములు నీవే మా ఏక దేవుడవు
తరతరములకు నీవే మా ఏక దైవము
Chorus
హల్లెలూయ – హల్లెలూయ
Verse
అబ్రహాము ఇస్సాకుల దేవుడనని సెలవిచ్చితివి
యాకోబు యోసేపులను దీవించి నడిపించితివి
ఈనాటి ఈ మా తరమును
చేయివిడువక నడిపించుమయా
మోషే యెహోషువలను స్వరమెత్తి పిలచితివి
ఏలీయా ఎలీషాలను అగ్ని జ్వాలగా చేసితివి
ఈనాటి ఈ మా తరమును
అగ్ని కణముగా చేయుమయా