Verse
యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి - యెహోవాను స్తుతించుడి
Verse
భక్తులు కూడుకొను సమాజములో - స్తోత్రగీతము పాడుడి
Verse
ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను
బట్టి సంతోషించెదరు గాక
సీయోను జనులు తమ రాజును బట్టి
ఆనందించుచు నుందురు గాక
Verse
నాట్యముతో వారు తన నామమును
శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
తంబురతోను సితారాతోను
తనివి తీర పాడుదురు గాక
Verse
యెహోవా ఆయన ప్రజల యందు
మహా ప్రేమ కలిగినవాడు
ఆయన బీదలను రక్షణతో
అందముగ అలంకరించును
Verse
భక్తులందరును ఘనతనొంది
నిత్యము ప్రహర్షింతురు గాక
సంతోషభరితులై పడకల మీద
వింత గానము చేతురు గాక