Chorus
యెహోవాకు స్తుతులు పాడండి - మీరు‖ మీరు ‖
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు
Verse
ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి - మీరు‖ మీరు ‖
Verse
తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది - మీరు‖ మీరు ‖
Verse
భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు - మీరు‖ మీరు ‖
Verse
అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే - మీరు‖ మీరు ‖