Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanaina Nenu Maarpu Leni Vaadanu Gaana

యెహోవానైన నేను మార్పు లేని వాడను గాన

Yehovanaina Nenu Maarpu Leni Vaadanu Gaana

Chorus
యెహోవానైన నేను మార్పు లేని వాడను గాన
యాకోబు సంతతివారగు మీరు లయము కాలేదు‖ 2x ‖
Verse
దేవుడెహోవ మనుష్యుడు కాడు - మాట మీరని వాడు
పశ్చాత్తాప పడడే మాత్రం - అబద్ధమాడ నేరడు
Verse
నా దాసుడైన దావీదు నిమిత్తము - నాదు నిమిత్తమును
ఈ పట్టణమును కాపాడి రక్షింతు - వేరుతన్ని వారెదుగుదురు
Verse
యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక
ఆపత్కాలమందున నీకు ఉత్తరము నిచ్చును గాక
Verse
సైన్యము లధిపతి ప్రత్యక్షమై - తన ప్రజలను రక్షింప
కిరీటమందలి రత్నములవలె - సురక్షితముగ నుండెదరు
Verse
గాలివానకు ఆశ్రయమై - పగటి ఎండకు నీడై
పర్ణశాల నొకటి యుండగ - సురక్షితముగ నుండెదరు
Verse
మహిమ యంతటి పైన తనదు - వితాన మేఘము నిలచు
సీయోను నందలి ప్రతి స్థలమందు ప్రభావ మహిమ ప్రజ్వలించు
Verse
లెమ్ము నీవు ఓ సీయోను - ధరియించు నీదు బలమును
లోనికి రాడు అన్యుడెవడును - హృదయ సున్నతి లేనివాడు

Related Tags

ProtectionFaithfulness