Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Sannutinchedan Aayananu Keerthinchedanu

యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను

Yehovanu Sannutinchedan Aayananu Keerthinchedanu

Verse
యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
నాకున్న స్వరము నన్ను విడచిననూ
నావారే నన్ను విడచి నింద లేసిననూ‖ 2x ‖
నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
నాకున్న భయములే నన్ను కృంగదీయగా
నా హృదయం నాలోనే నలిగిపోయెగా‖ 2x ‖
నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
నా ఆశలే నిరాశలై నిసృహలో వుండగా
నాపైన చీకటియే నన్నావరించెగా‖ 2x ‖
నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా‖ 2x ‖
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖

Related Tags

PraiseWorship