Verse 1
Reference: దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను యిర్మియా Jeremiah 15:21
Chorus
యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడు
శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే
Verse
యోసేపును విడిపించిన కర్త - ఎల్ల - మోసములోనుండి కాచున్
ప్రియముతోడ పాశముతోడ - నాశము లేకుండ బ్రోచిన దేవుడే
Verse
షిమ్యోనును గాచిన ప్రభువు - ప్రతి - నిమిషము మనలను కాచున్
కూడెద మిపుడే స్తోత్రముతోడ - పాడెద మిచ్చట కూడిన మనము
Verse
మనష్షేను కరుణించి - వాని పాపములను మన్నించెన్
రాజాధిరాజు తప్పడు మాట - ఎన్నటెన్నటికి మనతో నుండును
Verse
యెహోయాకీను తలనెత్తి మరణాజ్ఞనుండి మన్నించి
చెరవస్త్రములను మార్చిన తండ్రి డాగులేని వస్త్రముల మనకిచ్చెను
Verse
యిర్మియాను పైకెత్తి - చెఱ ముట్టడినుండి కాపాడి
విడుదలనిచ్చి యింటికి నడిపి - కష్టములబాపి ప్రేమ చూపించెను
Verse
పేతురును కాచినదూత - అనేకులకాచిన ప్రభువు
ప్రార్థనలెల్ల వెంటనే వినుచు - సంఘపు మొఱలను విని విడిపించెను
Verse
పౌలును సీలను కాచి - సంఘ చింతల నెల్లను తీర్చి
విడుదల నిచ్చున్ తిమోతియుకు - కడు భక్తితో పాడెదముగా హల్లెలూయ