Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Sthuthinchudi Meeru Yehova Naamamunu Sthuthiyinchudi

యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతియించుడి

Yehovanu Sthuthinchudi Meeru Yehova Naamamunu Sthuthiyinchudi

Chorus
యెహోవాను స్తుతించుడి - మీరు - యెహోవా నామమును స్తుతియించుడి
Chorus
అను పల్లవి: యెహోవా సేవకులారా - మీరు స్తుతించుడి
Verse
యెహోవా మందిర పునాదిని వేసిన - దినమున పలికిన ప్రవక్తల మాటన్
నేటి దినమున వినెడి మీరు - ధైర్యము తెచ్చుకొనుడనె ప్రభువు
Verse
పూర్ణ మనస్సుతో సేవించు భక్తుల - కరుణతో తన కృప జూపుట మరువని
నిబంధన నెరవేర్చు నీవంటి దేవుడు - భూమ్యాకాశములందున లేడని
Verse
ఇల దావీదను పితరుని తోడ - సెలవిచ్చిన మాట నెరవేర్చెను ప్రభు
సొలొమోను నందా వాగ్దానములను - కన్నుల విందుగ నెరవేర్చెనుగా
Verse
పోవుడి, పోవుడి - తొలగిపోవుడి - అపవిత్రమైన దేని ముట్టకుడి
యెహోవా సేవోప కరణములను - మోయు వారలగు మీరు శుద్ధి చేసికొనుడి
Verse
ఆలకించుడి మీరు తన సేవకుడు - వివేకముగా ప్రవర్తించును గాన
ఉన్నతమైన స్థానమందుండి - ఘనుడైనవాడై హెచ్చింపబడును
Verse
పర్వతములపై ఎంతో సుందరములు - రాజ్య సువార్తను చాటించువారై
సీయోను! నీ దేవుడేలు చున్నాడని - స మాధానమును ప్రకటించు పాదములు
Verse
ఆ నగరములో నుండదు శాపము - దేవుని గొర్రెపిల్ల సింహాసనముండు
సేవింతురు తన దాసులాయనను - రవి తేజులై దివి రాజ్యమునందు

Related Tags

PraiseWorshipZion